కార్తీకపురాణం ద్వితీయ అధ్యాయం
ఓం శ్రీగురుభ్యోనమః ఓం శ్రీ సత్య పదానంద ప్రభూజీ స్వామినే నమః "కార్తీకపురాణం ద్వితీయ అధ్యాయం" సోమవార వ్రత మహిమ:- వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు ”జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసములో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే, కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని,దాని మహత్యాన్ని గురించి చెబుతాను సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు. ”కార్తిక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతా ఉపవాసముండాలి. నదీస్నానం చేసి, తమ శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి,సాయంత్రం నక్షత్రదర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉంటూ, ఆ రాత్రంతా జాగరణ చేసి, పురాణ పఠనం చేయాలి.ఉదయం నదీస్నానం ఆచరించాలి. నువ్వులను దానం చేయాలి (తిలాదానం). తమ శక్తికొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత, తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార...
Comments
Post a Comment