Posts

Showing posts from November, 2020

కార్తీకపురాణం - Karthika Puranam

 కార్తీకపురాణం మొదటి అధ్యాయం కార్తీకపురాణం ద్వితీయ అధ్యాయం కార్తీకపురాణం మూడవ అధ్యాయము

కార్తీకపురాణం మూడవ అధ్యాయము

 ఓం శ్రీగురుభ్యోనమః ఓం శ్రీ సత్య పదానంద ప్రభూజీ స్వామినే నమః       "కార్తీకపురాణం మూడవ అధ్యాయము" కార్తీక మాస  స్నాన మహిమ:- జనక మహరాజా ! కార్తిక మాసమున యే ఒక్క చిన్న దానము చేసిననూ, అది గొప్ప ప్రభావము గలదై ,దానము చేసిన వారికి సకలైశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము  "శివ సాన్నిధ్యమును" చేరుదురు.  కానీ, కొంత మంది  ఆశాశ్వతములైన భోగభాగ్యములు విడువలేక, కార్తిక స్నానములు చేయక , అవినీతి పరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి,కుక్క,పిల్లులుగా జన్మింతురు.కనీసము కార్తీక మాస శుక్ల పార్ణమి రోజునైననూ స్నాన, దాన, జపతపాదులు, చేయక పోవుట వలన  అనేక చండాలాది జన్మ లెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు.  దీనిని గురుంచి నాకు తెలిసిన ఒక ఇతిహాసం వినిపించెదను.సపరి వారముగా శ్రద్దగా వినుడు. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట:- ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు,  తపఃశాలి, జ్ఞానశాలి, సత్యవ్యాక్య పరిపాలకుడు అగు"తత్వనిష్టుడు" అను బ్రాహ్మణుడు ఉండెను ఒక నాడా  బ్రాహ్మణుడు తీర్ధయాత్రాసక్తుడై  అఖండ గోదావరికి బయలు ద...

కార్తీకపురాణం ద్వితీయ అధ్యాయం

 ఓం శ్రీగురుభ్యోనమః ఓం శ్రీ సత్య పదానంద ప్రభూజీ స్వామినే నమః       "కార్తీకపురాణం ద్వితీయ అధ్యాయం" సోమవార వ్రత మహిమ:- వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు ”జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసములో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే, కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని,దాని మహత్యాన్ని గురించి చెబుతాను సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు. ”కార్తిక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతా ఉపవాసముండాలి. నదీస్నానం చేసి, తమ శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి,సాయంత్రం నక్షత్రదర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉంటూ, ఆ రాత్రంతా జాగరణ చేసి, పురాణ పఠనం చేయాలి.ఉదయం నదీస్నానం ఆచరించాలి. నువ్వులను దానం చేయాలి (తిలాదానం). తమ శక్తికొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత, తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార...

కార్తీకపురాణం మొదటి అధ్యాయం

 ఓం శ్రీగురుభ్యోనమః ఓం శ్రీ సత్య పదానంద ప్రభూజీ స్వామినే నమః        "కార్తీకపురాణం మొదటి అధ్యాయం" కార్తీక మాసం విశేషం:- ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు.”ఓ మహాత్మా మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను, వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత, కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..” అని కోరారు. శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… ”ఓ పునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో, పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి” అని చెప్పసాగాడు. పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వ...